Wednesday, January 1, 2025

ముంబయిలో మహిళా పైలట్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఎయిర్ ఇండియాలో పైలట్‌గా పనిచేస్తున్న ఒక 25 ఏళ్ల మహిళ తన ఫ్లాట్‌లో డాటా కేబుల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆత్మహత్యకు పురిగొల్పాడన్న ఆరోపణలపై ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరోల్ ప్రాంతంలోని కనకియా రెయిన్ ఫారెస్ట్ అపార్ట్‌మెంట్‌లో అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్న సృష్టి తులి సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. మాంసాహారం తినడం ఆపేయాలంటూ సృష్టిని ఆమె ప్రియుడు ఆదిత్య పండిట్(27) వేధించేవాడని మృతురాలి బంధువులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం పోలీసులు పండిట్‌ను అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సృష్టి గత ఏడాది జూన్ నుంచి మంబయిలో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం కమిర్షయల్ పైలట్ కోర్సు చేస్తుండగా ఢిల్లీలో సండిట్‌తో ఆమెకు పరిచయమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News