Monday, December 23, 2024

మూత్ర విసర్జన ఘటన.. బాధితురాలికి సహకరించని ఎయిర్ ఇండియా పైలట్..

- Advertisement -
- Advertisement -

ఎయిర్ ఇండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన అనంతరం బాధితురాలికి పైలట్ సహకరించలేదని ప్రయాణికుడు ఒకరు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే సీటు కేటాయించేందుకు భాధిత మహిళ రెండుగంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపారు. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో అమెరికాకు చెందిన డాక్టర్ సుగత భట్టాచార్జీ క్లాసులో ఢిల్లీకి వస్తున్నారు. మద్యం మత్తులో నిందితుడు బాధితురాలిపై మూత్ర విసర్జన చేశాడు.

ఘటన అనంతరం ఫస్టుక్లాస్ సీట్లు ఖాళీగా ఉన్నా విమాన పైలట్ ఆమెను అనుమతించలేదని లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు ఎయిర్‌హోస్టేస్‌లు బాధితురాలు దుస్తులు మార్చుకుని శుభ్రపడేందుకు సాయం చేశారని, ఆమె వస్తువులను శానిటైజ్ చేశారని డాక్టర్ భట్టాచార్జీ తెలిపారు. బిజినెస్ సీట్లు ఖాళీ లేకపోవడంతో బాధితురాలు చివరివరకు స్టీవార్డ్ సీటులో కూర్చుని ప్రయాణించారని భట్టాచార్జీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News