- Advertisement -
న్యూఢిల్లీ: తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఏకంగా విమాన కాక్‌పిట్‌లోకి తీసుకువెళ్లిన ఓ ఎయిరిండియా పైలెట్‌పై, అప్పుడు విమానంలో ఉన్న మొత్తం సిబ్బందిపై తాత్కాలిక వేటు పడింది. రెండు నెలల క్రితం దుబయ్ ఢిల్లీ విమానంలో పైలెట్ తన స్నేహితురాలితో మాట్లాడుతూ సరదాగా గడిపిన ఘటన సంచలనానికి దారితీసింది. ఆమె క్యాబిన్లోకి ఏ విధంగా వెళ్లింది? ఇతర సిబ్బంది అడ్డుచెప్పలేదా? ఇదంతా ఏ విధంగా జరిగింది? అనేది తేలేవరకూ అప్పటి ఈ విమాన పైలెటును ఇతర సిబ్బందిని అంతటిని విధుల నుంచి తప్పించాలని పౌరవిమానయాన నిఘా సంస్థ డిజిసిఎ ఆదేశించింది.
ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఈ దురుసు వ్యవహారంపై ఇప్పుడు స్పందన వెలువడింది. ప్రాధమిక సమాచారం ప్రకారం కేబిన్ సిబ్బందికి ఘటనతో ఎటువంటి సంబంధం లేదని వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు తరువాతనే సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటారు.
- Advertisement -