Monday, December 23, 2024

ఎయిరిండియా విమానాల నయా లుక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పటినుంచి దాని అభివృద్ధిలో భాగంగా వివిధ మార్పులకు శ్రీకారం చుడుతున్న టాటా గ్రూపు .. ఇటీవల సంస్థ లోగో, విమానాల రూపు(ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ)లో మార్పులు చేసింది. ఈ నయాలుక్‌లోకి మారిన విమానం ఫస్ట్‌లుక్‌ను తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. ఫ్రాన్స్‌లోని టౌలోసి వర్క్‌షాపులో కొత్త లోగో,డిజైన్‌తో సరికొత్తగా రూపుదిద్దుకున్న ఎ350 విమానం ఫొటోలను ఎయిరిండియా తన ఎక్స్ (పాత ట్విట్టర్)ఖాతాలో షేర్ చేసింది.ఈ శీతాకాలానికి ఎ350 విమానాలను మన దేశానికి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‘ ద విస్టా’గా వ్యవహరించే కొత్త లోగోలో పసిడివన్నె మహారాజా మస్కట్ విండోఫ్రేమ్‌ను ఉంచారు. అపరిమిత అవకాశాలు, ప్రగతిశీలత, భవిష్యత్తుపై విమానయాన సంస్థకు ఉన్న విశ్వాసానికి, ధైర్యానికి సంకేతంగా ఈ కొత్త లోగోను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.

లోగోలో ఎయిరిండియా ఫాంట్‌ను కూడా మార్చింది. దీనికోసం సొంతంగా ‘ఎయిర్ ఇండియా శాన్స్’ఫాంట్‌ను డిజైన్ చేశారు. అలాగే ఎరుపు, ఊదారంగు,బంగారు వర్ణం డిజైన్లతో విమానాల డిజైన్‌ను మార్చారు.ఎయిర్ ఇండియా తొలి ఎ350 విమానాన్ని ఈ నయాలుక్‌తో తీర్చిదిద్దారు. తమ ఫ్లీట్‌లో ఉన్న పాతవిమానాలన్నిటినీ ఈ డిజైన్‌లోకి మార్చనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకోసం 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. సంస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది. కాగా ఈ ఏడాది డిసెంబర్‌నుంచి కొత్త లోగోతో కొన్ని విమాన సర్వీసులు మొదలు కానున్నాయి.2025 నాటికి ఎయిర్ ఇండియాలోని మొత్తం విమానాలను కొత్త లోగోలోకి మార్చనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News