- Advertisement -
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే విమానసర్వీస్‌లను ఎయిరిండియా తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ విమానాల రద్దును మరికొన్ని రోజులు పొడిగించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్టా ఢిల్లీటెల్ అవీవ్ మధ్య రాకపోకలు సాగించే విమానాలను అక్టోబరు 18 వరకు నిలిపివేస్తున్నట్టు ఎయిరిండియా అధికారి శనివారం వెల్లడించారు.
అయితే అవసరాన్ని బట్టి ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఛార్టెర్డ్ విమానాలను నడుపుతుందని ఆ ఆధికారి తెలిపారు. సాధారణంగా ఢిల్లీ టెల్ అవీవ్ మధ్య సోమ, మంగళ,గురు, శని, ఆదివారాల్లో ఎయిరిండియా విమానాలు నడుపుతోంది. అయితే ఉద్రిక్తతల దృష్టా అక్టోబరు 7 నుంచి ఈ సర్వీస్‌లను నిలిపివేశారు.
- Advertisement -