Friday, April 4, 2025

టెల్ అవీవ్ విమాన సర్వీసులు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో టెల్ అవీవ్‌కు రాకపోకలను తిరిగి ప్రకటించేంత వరకు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా (ఎఐ) శుక్రవారం ప్రకటించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా దేశ రాజధాని నుంచి టెల్ అవీవ్‌కు సర్వీసులను గురువారం (8) వరకు తొలుత నిలిపివేసింది. ‘మధ్య ప్రాచ్యంలోని ఆ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి

దృష్టా టెల్ అవీవ్‌కు మా విమాన సర్వీసుల నిర్వహణను తిరిగి ప్రకటించేంత వరకు నిలిపివేయడమైంది. మేము నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం’ అని ఎయిర్ ఇండియా ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేసింది. టెల్ అవీవ్‌కు రాకపోకల నిమిత్తం ముందుగా నిర్ధారిత టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి విమాన సంస్థ పూర్తి వాపస్‌ను ఆఫర్ చేస్తున్నది. ఇజ్రాయెల్‌కు, హమాస్‌తో సహా వివిధ ఉగ్ర మూకలకు మధ్య సంఘర్షణల దృష్టా మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News