- Advertisement -
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నవంబర్ 30 వరకు టెల్ అవివ్కు విమాన సేవలను రద్దు చేస్తూ ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 నుంచి టెల్ అవివ్కు ఎయిర్ ఇండియా ఫ్లైట్లను నడపడం లేదు. ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, నవంబర్ 30 వరకు టెల్ అవివ్కు విమాన సేవలను రద్దు చేసినట్టు తెలిపారు. భారతదేశం రాజధాని నుంచి టెల్ అవివ్కు ప్రతి వారం ఐదు ఫ్లైట్లను కంపెనీ నడుపుతోంది. అయితే ఇప్పుడు ఈ సేవలను నిలిపివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
- Advertisement -