Monday, December 16, 2024

ప్రత్యేక హజ్ విమానాలను నడపడానికి సిద్ధమైన ఎయిర్ ఇండియా గ్రూప్..

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ, స్టార్ అలయన్స్ సభ్యుడు ఎయిర్ ఇండియా,భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, భారతదేశంలోని నాలుగు నగరాల నుండి సౌదీ అరేబియాలోని జెద్దా, మదీనాకు దాదాపు 19,000 మంది హజ్ యాత్రికులను చేర వేయనున్నాయి . ఈ సంవత్సరం హజ్ కార్యకలాపాలలో భాగంగా మొదటి ఎయిర్ ఇండియా విమానం, నిన్న, AI5451, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 1105 గంటలకు బయలుదేరింది మరియు 1350 గంటలకు (స్థానిక సమయం ) మదీనా చేరుకుంది.

మొదటి దశ కార్యకలాపాల సమయంలో,21 మే నుండి 21 జూన్ 2023 వరకు జైపూర్, చెన్నై నుండి మదీనా, జెద్దాలకు వరుసగా 46 విమానాలను ఎయిర్ ఇండియా నడుపునుంది. రెండవ దశలో, ఎయిర్ ఇండియా యాత్రికులను జెద్దా, మదీనా నుండి జైపూర్, చెన్నై వరకు 3 జూలై నుండి 2 ఆగస్టు 2023 వరకు 43 విమానాలను నడుపనుంది. మొత్తంమీద, ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787, ఎయిర్‌బస్ 321నియో విమానాలతో సౌదీ అరేబియాకు మొత్తం 10318 మంది ప్రయాణికులను చేరవేయనుంది.

మరోవైపు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన B737-800 విమానాలను 2023 జూన్ 4 నుండి 22వ తేదీ వరకు కోజికోడ్ మరియు కన్నూర్ నుండి నడపనుంది. ఇది కోజికోడ్ నుండి జెడ్డాకు 44 విమానాలను మరియు 13 విమానాలను కన్నూర్ మరియు జెడ్డా మధ్య నిర్వహించనుంది . రెండవ దశలో, 13 జూలై నుండి ఆగస్టు 2, 2023 వరకు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యాత్రికులను మదీనా నుండి కోజికోడ్, కన్నూర్‌లకు తిరిగి పంపుతుంది.

ఈ కార్యకలాపాలపై ఎయిర్ ఇండియా సిఈఓ, ఎండి, కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ, “పవిత్ర హజ్ యాత్ర కోసం చెన్నై మరియు జైపూర్ నగరాల నుండి వార్షిక ప్రత్యేక విమానాలను తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉంది, మా ప్రత్యేక విమానాల ద్వారా యాత్రికులకు సేవలందించేందుకు మేము ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ & ఎయిర్ ఏషియా ఇండియా, ఎండి, అలోక్ సింగ్ మాట్లాడుతూ, “కేరళ నుండి వచ్చే యాత్రికుల ప్రయోజనం కోసం, సౌదీ అరేబియా కు ముంబై, మంగళూరు, తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్, కన్నూర్ ల నుంచి మా షెడ్యూల్ చేసిన విమానాలతో పాటు కోజికోడ్ మరియు కన్నూర్ నుండి హజ్ ప్రత్యేక విమానాలను నడపడం మాకు సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేక కార్యక్రమంతో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా సౌకర్య వంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తున్నాయి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News