Friday, December 20, 2024

మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్‌లైన్స్

- Advertisement -
- Advertisement -

డాలస్: అమెరికా లోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. టెక్సాస్ లోని హోటల్‌లో బస చేసిన విమాన పైలట్ ఫ్లైట్ బయలుదేరే సమయానికి మద్యం మత్తులో హోటల్ సిబ్బందితో , అతిథులతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. పైలట్ మద్యం మత్తులో ఉండడం, మరో పైలట్ అందుబాటులో లేని కారణంగా విమానాన్ని జపాన్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. అనంతరం అందులోని 157 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసింది.

విమాన సిబ్బందిలో ఒకరికి అనారోగ్యం కారణంగా విమానాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు తెలిపిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది.“ఫ్లైట్ రద్దు చేయడం వల్ల అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మా సేవలపై నమ్మకాన్ని ఉంచండి ” అని ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News