Monday, December 23, 2024

వాయు కాలుష్యం వల్ల చర్మ క్యాన్సర్ 

- Advertisement -
- Advertisement -

రోజురోజుకి గాలి విషపూరితంగా మారుతోంది. కాలుష్యం స్థాయి ప్రమాదకరంగా మారుతోంది. గాలిలో ఉండే చిన్న రేణువులు అనేక విధాలుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీని వల్ల దగ్గు, తలనొప్పి, కళ్ల మంట, ఆయాసం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. నిత్యం వాయు కాలుష్యంలో ఎక్కువ ఉండేవారికి, బయట పని చేసుకునేవారికి చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, అందుకుగాను జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాయు కాలుష్యం ఆరోగ్యానికి ఎంత ప్రమాదం అంటే? కాలుష్యాన్ని పీల్చడం అంటే విషపూరితమైన గాలి రోజుకు 12 సిగరెట్లు తాగడం వల్ల కలిగే హానిని కలిగిస్తుంది. ఇది ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఈ గాలిలో ఉండడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులు కూడా వస్తాయి.

ఎక్కువ కాలం కాలుష్యానికి గురికావడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కలుషితమైన గాలి అనేక రకాల హానికరమైన చిన్న కణాలను కలిగి ఉంటుంది. వీటిలో అస్థిర కర్బన సమ్మేళనాలు, పాలీసైక్లిక్ సుగంధ కాలుష్య కారకాలు, నలుసు పదార్థం చాలా ముఖ్యమైనవి. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ కణాలను కడగడం అంత సులభం కాదు. క్రమంగా అవి చర్మానికి తీవ్రమైన హాని కలిగించడం ప్రారంభిస్తాయి.

వాతావరణ కాలుష్యం వల్ల చర్మనికి బాగా హాని జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా చర్మం దెబ్బతినడమే కాకుండా..వయస్సుకు ముందే ముఖం వాడిపోతుంది. మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. కాలుష్యం కారణంగా చర్మంపై అదనపు పిగ్మెంటేషన్, ముడతలు కనిపిస్తాయి. చర్మం పొడిగా మారుతుంది.

కాలుష్యం ప్రమాదం నుండి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి?

1. చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అందుకుగాను కొబ్బరి నూనె, మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకోవాలి.
2. మరీ వేడి నీళ్లతో స్నానం చేయకూడదు.
3. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.
4. చర్మాన్ని కప్పుకుని మాత్రమే బయటికి వెళ్ళాలి.
5. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు నడవకూడదు.
6. ఆహారం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకొవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News