Friday, January 24, 2025

ఢిల్లీ గాలితో మరింత ముప్పు

- Advertisement -
- Advertisement -

Air pollution has increased in Delhi

పెరిగిన వాయుకాలుష్య సూచికలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం మరింత పెరిగింది. జనవరి నుంచి చూస్తే ఇప్పుడు గాలి మరింత కాలుష్యమయం అయిందని తెలిపే తీవ్రస్థాయి వాయు నాణ్యతల సంకేతాలు వెలువడ్డాయి. వచ్చే రెండు మూడు రోజులలో ఈ వాయుకాలుష్యం మరింత పెరుగుతుంది. దీనితో అనేక రకాల ఆరోగ్య ప్రతికూలతలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం అయింది. ఢిల్లీలోని ఆనంద్‌విహార్ వద్ద ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ (ఎక్యూఐ) శుక్రవారం మధ్యాహ్నానికి 455గా ఉంది. దీనితో ఢిల్లీలో అత్యధికంగా కాలుష్యానికి గురైన ప్రాంతంగా ఆనంద్ విహార్ నిలిచింది. సాయంత్రం ఐదింటికి ఢిల్లీలో మొత్తం మీద ఎక్యూఐ 357 అయింది. ఇందులో గజియాబాద్ 384, నోయిడా 371, గ్రేటర్ నోయిడా 364, ఫరీదాబాద్‌లో 346 ఇండెక్స్‌లు నమోదు అయ్యాయి. ఢిల్లీ ఒక్కటే కాకుండా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో, దేశంలోని 34 నగరాలలో విషమ కాలుష్య పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎక్యూఐ పరిధిలో చూస్తే సూచిక సున్నా నుంచి 50 లోపున ఉంటే ఇది కాలుష్యం అదుపు పరిస్థితి. 51 100 అయితే అది సంతృప్తికరం, 101 200 అయితే ఓ మోస్తరు.

ఆ తరువాతి స్థాయి దయనీయం, విషమంగా లెక్కలోకి వస్తుంది. గాలి దిశలను బట్టి వాయు నాణ్యతలు దెబ్బతింటున్నాయి. అదే విధంగా గాలి వేగం కూడా వాయుకాలుష్యాన్ని ప్రభావితం చేస్తుంది. పరిసరాలలో పంట వ్యర్థాలను కాల్చివేయడం ద్వారా కమ్ముకునే పొగతో కాలుష్య రేణువులు దట్టంగా గాలిలో చేరుతాయి. ఇది కాలుష్య తీవ్రతకు దారితీస్తాయి. అయితే ఈసారి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దీపావళి రోజులలో కాలుష్య శాతం తగ్గింది. 7 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ఈ దశలో కాలుష్యం తక్కువ స్థాయిలో రికార్డు అయింది. ఈ నెల 24 నుంచి రాజధానిలో వాయు నాణ్యత దయనీయం నుంచి విషమదశకు చేరుకుంటూ వస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News