Saturday, November 16, 2024

కాలుష్యం కోరల్లో దేశ రాజధాని..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత మరోసారి ప్రమాదస్థాయికి చేరుకుంది. శనివా తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘తీవ్రస్థాయి’కి చేరుకుంది. మొత్తంగా సెంట్రల్ సొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం నగరంలో వాయు నాణ్యత సూచీ 346గా నమోదయింది. లోధీ రోడ్డు, జహంగీర్ పురి, ఆర్‌కె పురం, ఐజిఐ ఎయిర్‌పోర్టు టి3వద్ద పొగమంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గురువారం ఉదయం 351గా ఉండిన వాయు నాణ్యత సూచీ.. శుక్రవారం ఉదయానికి ఏకంగా 471కు పెరిగిపోయింది.

ఢిల్లీ నగర శివారుల్లోని ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 62, సెక్టార్ 1, సెక్టార్ 116 వద్ద గాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు వ్లెడించారు. అనవసరమైన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.‘శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.చాలా మంది దగ్గు, జలుబు, కళ్లనుంచి నీరు కారడం,కళ్లు మండడం వంటి సమస్యలతో బాధపడతున్నారు’ అని ఓ వైద్యుడు చెప్పారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజధానిలో అయిదు రోజుల పాటు నిర్మాణ కార్యకలాపాలు చేపట్టరాదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. వాహనాలనుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలో రెడ్ సిగ్నల్ పడగానే వాహనాల ఇంజిన్‌ను అపేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే కాలుష్యాన్ని వెదజల్లే పాతకాలపు వాహనాలు, కమర్షియల్ వాహనాలపైనా నిషేధం విధించారు. దీంతో పాటుగా వెయ్యి సిఎన్‌జి బస్పులను ప్రవేశపెట్టేందుకు యత్నాలు చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు ఇదివరకే రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

అయితే వాయుకాలుష్యం బెడద ఒక్క ఢిల్లీ నగరానికి పరిమితం కాలేదు. పొరుగు రాష్ట్రాలయిన హర్యానా, రాజస్థాన్, యుపిలలోని పలు నగరాల్లో పరిస్థితి కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా హర్యానాలోని గుర్‌గ్రామ్,ఫరీదా బాద్, కురుక్షేత్ర, భివానీ, కర్నాల్, యుపిలోని ఘజియాబాద్, భాగ్‌పత్, మీరట్, నోయిడా, గ్రేటర్ నోయిడా, రాజస్థాన్‌లోని భివాడి, హనుమాన్ ఘర్, శ్రీగంగానగర్ లాంటి పట్టణాలు వాయు కాలుష్యం సమస్యతో సతమతమవుతున్నాయి.

కేజ్రివాల్‌తో ఎల్‌జి అత్యవసర సమావేశం
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో అత్యవసరంగా సమావేశం కానున్నారు. కేజ్రీవాల్‌తో పాటుగా ఢిల్లీ పర్యావరణ వాఖ మంత్రి గోపాల్ రాయ్‌ని కూడా తాను కలవనున్నట్లు సక్సేనా ఎక్స్‌లో ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News