Monday, December 23, 2024

ఢిల్లీలో తీవ్రంగా దిగజారిన వాయు నాణ్యత..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత దిగజారి తీవ్ర కేటగిరీ లోకి ప్రవేశించింది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి తోడు నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు కాకపోవడంతో పరిస్థితి రానురాను తీవ్రమౌతోంది. శుక్రవారం ఉదయం నుంచి ఢిల్లీ అంతటా వాయు కాలుష్యం పెరిగి సాయంత్రానికి వాయు నాణ్యత సూచి 405 పాయింట్లకు చేరింది. రాబోయే 24 గంటల్లో ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయు నాణ్యతపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ మాట్లాడుతూ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జి ఆర్ ఎ పి) స్టేజ్ 3 ఢిల్లీలో అమలు లోకి వచ్చిందని చెప్పారు.

ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అత్యవసరం కాని నిర్మాణ పనులు, బిఎస్ 3 పెట్రోల్, బిఎస్4 డీజిల్ ఫోర్ వీలర్ల వాహనాలపై నిషేధం విధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) డేటా ప్రకారం వాయు నాణ్యత సూచి (ఎక్యుఐ) 050 మధ్య ఉండే “మంచిది”. 51100 “సంతృప్తికరం”, 101200 “మితమైనది”, 201300 “పేలవమైనది”, 301 400 “చాలా పేలవం”, 401500 “తీవ్రమైనది”గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ ఎక్యుఐ “తీవ్రమైన ప్లస్‌” విభాగంలోకి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News