Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం

- Advertisement -
- Advertisement -

వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత 72 గంటల్లో సిటీలో గాలి నాణ్యత క్షీణించింది. టపాసులు భారీగా కాల్చడంతో కాలుష్యం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 శాతం కాలుష్యం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 171 గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు కాగా కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్ నగర్ అధికంగా వాయు కాలుష్యం పెరిగింది. రాష్ట్ర రాజధానిని వాయు కాలుష్యం కమ్మేస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం హైదరాబాద్‌లో 171 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగిపోతుండటం నగరవాసులను కలవరపెడుతోంది. హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా గత దశాబ్దకాలంలో 6,000 మందికి పైగా మరణాలు సంభవించాయి. లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఒక్క 2023 లోనే వాయు కాలుష్యానికి సంబంధించి మరణాల సంఖ్య 1,597గా ఉంది.

పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపనుంది. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి వల్ల కేసులు పెరుగుతున్న పరిస్థితి. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, వాహనాల రద్దీ పెరిగిపోవడం.. పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించడం వల్లే గాలి నాణ్యత పడిపోతోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ లో కూడా గాలి కాలుష్యం ఎక్కువైంది. నగరంలో ఇటీవల గాలి నాణ్యతలో గణనీయమైన క్షీణత కనిపిస్తోంది. దీపావళి వేడుకల సమయంలో గాలి కాలుష్యం పెరిగింది. గత 72 గంటల్లో నగరంలో గాలి నాణ్యత బాగా క్షీణించిందని చెబుతున్నారు.

భారీగా బాణసంచా కాల్చడమే దీనికి కారణంగా వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాయు కాలుష్యం 10% పెరిగింది. కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్‌నగర్ లో గాలి కాలుష్యం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆమోదయోగ్యమైన పరిమితి 60 ఉండగా చాలా ప్రాంతాల్లో171పై నమోదు అయింది. సోమాజిగూడలో 105 ఏక్యూఐ నమోదు కాగా, న్యూ మలక్‌పేట 335కి చేరుకుంది. యు.ఎస్ కాన్సులేట్ అబ్జర్వేటరీలో 475 గా నమోదైంది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం : గాలి కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని, ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రెక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అధిక స్థాయి వాయు కాలుష్యానికి స్వల్పకాలిక బహిర్గతం దగ్గు, శ్వాసలోపం, ఛాతీ బిగుతు వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక ఎక్స్పోజర్ ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, వాయు కాలుష్యం పిల్లలలో ఊపిరితిత్తుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఇది యుక్తవయస్సు వరకు కొనసాగే దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుందని చెబుతున్నారు.

గ్రేటర్‌లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ : హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. దీపావళి ఎక్కడ చూసినా టపాసుల పేలుళ్లతో నగరం హోరెత్తిపోయింది. దీంతో ఓ వైపు కాలుష్యంతో పాటు మరోవైపు శబ ్ధకాలుష్యం కూడా పెరిగింది. గడిచిన 48 గంటల్లో నగరంలో గాలి నాణ్యత పూర్తిగా దిగజారింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 10 శాతం మేర ఎయిర్ పొల్యూషన్ పెరిగింది. కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్ నగర్‌లో అధికంగా వాయు కాలుష్యం పెరిగింది. గాలిలో ప్రమాదకరస్థాయిలో దుమ్ము ధూళి కణాలు పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. సిటీలో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కారకాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్171కు పెరిగింది. 60 పాయింట్లలోపు ఉండాల్సి ఉండగా సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలో 335 ఐక్యూఐ, జూపార్క్ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్-2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లుగా నమోదు అయినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News