Tuesday, December 17, 2024

ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత  

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో మరోసారి గాలి నాణ్యత పడిపోయింది. సోమవారం రాత్రి 10 గంటలకు గాలి నాణ్యత 400 పాయింట్లకు పడిపోయింది. దీంతో గ్రాప్ 4 ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చామని అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక కమిటీ ఆదేశాల మేరకు సంబంధిత రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీలోని లోధి రోడ్ లో ఉష్ణోగ్రత 5 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాహనదారులకు దృశ్యమానత తగ్గిపోవడంతో లైట్ల వెలుతురులోనే వారు ప్రయాణాలు చేస్తున్నారు.  గాలి నాణ్యతలు, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది.

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News