Sunday, January 19, 2025

ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్!

- Advertisement -
- Advertisement -

ఇరుకు రోడ్లపై ముందుకు కదలని ట్రాఫిక్ తో విసిగిపోయారా? కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణమంటేనే బెంబేలెత్తిపోతున్నారా? అయితే మీకో శుభవార్త. రానున్న రోజుల్లో మీకోసం ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. మరో మూడేళ్లలో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామని ఇంటర్ గ్లోబ్ సంస్థ చెబుతోంది. నలుగురు కూర్చుని హాయిగా ప్రయాణించదగిన ఈ ఎయిర్ ట్యాక్సీలను ప్రయాణానికే కాకుండా, కార్గో, లాజిస్టిక్స్, వైద్య సేవలకూ వినియోగిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ముందుగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి హర్యానాలోని గుర్ గ్రామ్ కి రవాణా సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య రోడ్డు ప్రయాణానికి ప్రస్తుతం 60నుంచి 90 నిమిషాల సమయం పడుతోంది. ఎయిర్ ట్యాక్సీలో ఏడు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇందుకోసం ఆర్చర్ ఏవియేషన్ కు చెందిన 200 ఎయిర్ ట్యాక్సీలను కొనుగోలు చేయనున్నట్లు ఇంటర్ గ్లోబ్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News