Thursday, January 9, 2025

మలేషియాకు వీసా ఫ్రీ ట్రావెల్ ను అందిస్తున్న ఎయిర్ ఏషియా

- Advertisement -
- Advertisement -

రీసెంట్ గా భారతదేశం నుంచి వచ్చే యాత్రికుల కోసం వీసా ఫ్రీ ట్రావెల్ ను ప్రకటించింది మలేసియా. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కౌలాలంపూర్ కు లిమిటెడ్ పీరియడ్ తో ప్రత్యేక ప్రమోషనల ఛార్జీలతో విమాన సర్వీసుల్ని ప్రకటించింది ఎయిర్ ఏషియా. మలేషియా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో భారతీయ పౌరులు వీసా లేకుండా తమ దేశానికి రావొచ్చని ప్రకటించింది. ఇది ఒక అద్బుతమైన చర్య. దీనిద్వారా మలేసియా దేశానికి టూరింజం డిమాండ్ కచ్చితంగా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వీసా ఫ్రీ అనే ఈ సరికొత్త నిబంధన రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశం నుంచి మలేసియాకు విమాన సర్వీసుల్ని యాత్రికులకు డిమాండ్ కు అనుగుణంగా తిరువనంతపురం (21 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభం) నుంచి మలేషియాకు ప్రత్యేక ఛార్జీలతో విమాన సర్వీసుల్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది. 2024 మొదటి త్రైమాసికంలో ప్రారంభమయ్యే ఈ విమాన సర్వీసులతో మొత్తంగా 69 వారపు విమానాలు అవుతాయి. తద్వారా ఏడాదికి 1.5 మిలియన్ సీట్లతో రెండు దేశాల మధ్య సేవలను గణనీయంగా పెంచాలనుకుంటున్నట్లు గతంలో AirAsia యొక్క ప్రకటనతో ఇది అదనం.

ఇవాళ్టి నుంచి డిసెంబర్ 24, 2024 వరకు, గ్లోబ్-ట్రాటర్స్, అడ్వెంచర్ అన్వేషకులు ఎయిర్ ఏషియా యొక్క విస్తారమైన నెట్‌వర్క్‌ ద్వారా దక్షిణ భారతదేశంలోని ఏడు గమ్యస్థానాల నుండి చాలా ప్రత్యేకమైన ప్రమోషనల్ ధర కోసం విమానాలను బుక్ చేసుకోవచ్చు. చెన్నై, తిరుచిరాపల్లి, కొచ్చి, హైదరాబాద్, బెంగుళూరు, కోల్‌కతా, త్వరలో త్రివేండ్రం నుంచి కౌలాలంపూర్‌కు కేవలం రూ.4,999తోనే ప్రయాణించవచ్చు. మలేషియా నుండి, భారతీయ ప్రయాణికులు తమ ఆశల రెక్కలను మరింత విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లోని 130 కంటే ఎక్కువ గమ్యస్థానాల ఎయిర్‌లైన్ యొక్క విస్తృత నెట్‌వర్క్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్లై-త్రూ ద్వారా ప్రయాణించవచ్చు.

ప్రయాణ వ్యవధి తక్షణమే ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ 30, 2024న ముగుస్తుంది. ఎయిర్ ఏషియా గెస్ట్ లు ఇప్పుడు ఎయిర్ ఏషియా సూపర్ యాప్ లేదా www.airasia.comని సందర్శించడం ద్వారా విలువ ఆధారిత ఛార్జీలతో అన్వేషించడానికి ఈ తగ్గింపు ధరల ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఈ సందర్భంగా ఎయిర్ ఆషియా రీజినల్ కమర్షియల్ (ఇండియా) హెడ్ మనోజ్ ధర్మాని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. “భారతీయ ప్రయాణికులకు 30 రోజుల వీసా ఫ్రీ ప్రవేశాన్ని పొడిగించేందుకు మలేషియా ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. భారతదేశం నుండి వచ్చే సందర్శకులకు మలేషియా ఎల్లప్పుడూ ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. అనేక అద్భుతమైన, తీర్థయాత్ర స్థలాలు, ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, అనేక రకాల రుచికరమైన స్థానిక ఆహారాలకు మలేసియా ఆహ్వానం పలుకుతోంది. ఇప్పుడు భారతీయ యాత్రికులు చాలా సులభంగా మలేసియా రాగలరు. ఎయిర్ ఏషియా భారతదేశం నుండి మలేషియాకు ఇవాళ్టి వరకు మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ ప్రాంతాన్ని అన్వేషించాలనే వారి కలలను నెరవేర్చుకోవడానికి చాలా మందికి అవకాశం కల్పించింది. రెండు దేశాల మధ్య మరింత సరసమైన ప్రయాణాన్ని అనుమతించడానికి మా కనెక్టివిటీ, మార్కెట్ ఉనికిని నిరంతరం విస్తరించేందుకు మేము ఎదురుచూస్తున్నాము అని అన్నారు ఆయన.

ఎయిర్ ఏషియా స్వల్ప-దూర, మధ్యస్థ-దూర విమానయాన సంస్థల ద్వారా చెన్నై, తిరుచిరాపల్లి, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, న్యూఢిల్లీ, అమృత్‌సర్ వంటి ఉత్తర, దక్షిణ నగరాల్లో భారతదేశం నుండి నేరుగా మలేషియాకు సర్వీసుల్ని అందిస్తుంది. మొత్తంగా ఎనిమిది మార్గాలలో సేవలందించే బలమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 2024 నాటికి, ఎయిర్ ఏషియా మరొక ఉత్తేజకరమైన గమ్యస్థానం అయినటువంటి తిరువనంతపురం నుంచి కౌలాలంపూర్‌కు విమానాలను ప్రారంభించనుంది. ఇది కేరళ రాష్ట్రం నుంచి కౌలాలంపూర్ కు రెండో విమాన సర్వీసు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News