Thursday, September 19, 2024

రిపేరు కోసం తీసుకెళుతుండగా కూలిపోయిన హెలికాప్టర్

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: కేదార్ నాథ్ రూట్ లో ఓ పాడయిపోయిన హెలికాప్టర్ ను ఎంఐ-17 అనే పెద్ద హెలికాప్టర్ తో తరలిస్తుండగా లించోలీ ప్రాంతంలోని థరు బేస్ క్యాంప్  వద్ద శనివారం కట్టిన తీగలు తెగిపోయి కూలింది. ఆ హెలికాప్టర్ ను కేదార్ నాథ్ హెలిపాడ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు. రిపేరు కోసం గౌచర్ ఎయిర్ స్ట్రిప్ కు తీసుకెళుతుండగా ఉదయం 7 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ‘‘థరు క్యాంప్ ప్రాంతంలో కేదార్ నాథ్ యాత్రికులు, స్థానికులు ఉన్నప్పటికీ ఎంఐ-17 పాయిలెట్ చాకచక్యంతో ఆ హెలికాప్టర్ జనానికి దూరంగా పడేలా జాగ్రత్త పడ్డాడు’’ అని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్ల లేదని రుద్రప్రయాగ్ విపత్తు నిర్వహణాధికారి నందన్ సింగ్ రజ్వార్ తెలిపారు. మందాకినీ నది వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుందని కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News