Thursday, January 23, 2025

అపార్ట్‌మెంట్ 4వ అంతస్తు నుంచి దూకి ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తన స్నేహితుడిని కలుసుకోవడానికి దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఒక ఎయిర్ హోస్టెస్ శుక్రవారం అర్ధరాత్రి ఒక అపార్ట్‌మెంట్‌లోని నాలుగవ అంతస్తు నుంచి దూకి మరణించింది. కోరమంగళ ప్రాంతంలోని రేణుకా రెసిడెన్సీ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల అర్చనగా పోలీసులు గుర్తించారు.

ఒక ప్రముఖ ఎయిర్‌లైన్ కంపెనీలో పనిచేస్తున్న అర్చన తన స్నేహితుడు ఆదేశ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంనీర్‌ను కలుసుకునేందుకు దుబాయ్ నుంచి వచ్చిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కేరళకు చెందిన ఆదేశ్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం ందని పోలీసులు చెప్పారు. అర్చన మృతదేహాన్ని సెయిట్ జాన్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News