న్యూఢిల్లీ: ఇక నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్ అధికారులకు ఇవ్వాల్సిందే. దీనికి సంబంధించిన ప్రతి విమానయాన సంస్థ అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను (పేరు, కాంటాక్ట్ నంబర్, పేమెంట్స్ వివరాలు) ఇవ్వాలని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వివరాలతో కస్టమ్స్ యాక్ట్ కింద నేరగాళ్ల గుర్తింపు, విచారణకు ఉపయోగించుకోవడంతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, దేశాలతోనూ ఈ వివరాలు పంచుకోనున్నట్లు కేంద్రం ఈ గెజిట్‌లో పేర్కొంది. దీంతో అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్న 60 దేశాల జాబితాలో భారత్ చేరింది. ప్రయాణికులు విమానంలో ప్రయాణం చేయడం, లేదా వస్తువులను విమానంలో రవాణా చేయడం లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. సామన్లను చేరవేసే అధీకృత ఏజెంట్ సైతం తమ వివరాలను కచ్చితంగా ఇవ్వాల్సిందేనని పేర్కొంది.
Airlines to give International Travellers data to Customs