- Advertisement -
పాట్నా: ట్రక్కుపై తరలిస్తున్న ఒక పాత విమానం బీహార్‌లోని మోతీహరిలో శుక్రవారం ఒక వంతెన కింద ఇరుక్కుపోవడంతో గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రక్కు డ్రైవర్లు, స్థానికుల సాయంతో ఆ విమానాన్ని బయటకు తీసుకువచ్చారు. ఈ పాత, పనిచేయని విమానాన్ని స్క్రాప్‌గా ముంబై నుంచి అస్సాంకు తరలిస్తుండగా మోతీహరిలోని పిప్రకోఠి వంతెన కింద ఈ ఘటన జరిగింది. ఇటువంటి సంఘటనే గత ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. కోచ్చి నుంచి హైదరాబాకు ట్రక్కు ట్రెయిలర్‌పై తరలిస్తున్న ఒక విమానం అండర్‌పాస్ వంతెన కింద ఇరుక్కుపోగా అష్టకష్టాలు పడి ఆ విమానాన్ని బయటకు తీసుకురాగలిగారు.
- Advertisement -