Sunday, December 22, 2024

జీ 20 అతిధులకు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జీ 20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతల కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఏర్పాట్లను పూర్తి చేసింది. వాయుసేన వీటిలో భాగస్వామి అయింది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు, బ్రిటన్, కెనడా ప్రధానులు సహా మొత్తం 70 మంది వీవీఐపీ విమానాలు ఫాలం టెక్నికల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ సహా కొన్నివిమానాలను ఫాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో పార్క్ చేయనున్నారు.

దీంతోపాటు అత్యవసర పరిస్థితుల కోసం లఖ్‌నవూ, జైపూర్, ఇండోర్, అమృత్‌సర్ లలోని నాలుగు రిజర్వు ఎయిర్‌పోర్టులను కూడా సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 220 పార్కింగ్ స్టాండ్‌లు ఉన్నాయి. కానీ విమానాల రద్దీ పెరగడంతో ఇవి చాలని పరిస్థితి. దీనికి తోడు గోఫస్ట్ దివాలాతో ఆ సంస్థకు చెందిన 50 విమానాలు ఇప్పటికే పార్కింగ్‌లో ఉండిపోయాయి. దీంతో నిర్ణీత తేదీల్లో ఈ విమానాశ్రయంలో ఛార్టర్, బిజినెస్ జెట్‌ల ల్యాండింగ్ , టేకాఫ్‌లను అనుమతించకూడదని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఆర్మ్ ట్రాఫిక్ కంట్రోల్ మార్గదర్శకాలు జారీ చేశాయి.

జీ20 సదస్సు నిర్వహించే తేదీల్లో సఫ్దర్‌గంజ్ ఎయిర్‌పోర్టును మూసివేయనున్నారు. ఇక్కడి నుంచి అత్యవసర బ్యాకప్ సపోర్ట్ , విధుల కోసం ఎయిర్ ఫోర్స్, ఎన్‌ఎస్‌జీ హెలికాప్టర్లను మాత్రమే టేకాఫ్, ల్యాండింగ్‌కు అనుమతిస్తారు. దేశాధి నేతలకు ఆహ్వానం పలికేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మూడు సెర్మోనియల్ లాంజ్‌లను సిద్ధం చేశారు. వీటిలో వారు తమ నిబంధనలు పూర్తి చేసుకొని వేగంగా వెళ్లిపోవచ్చు. సాధారణ ప్రయాణికులకు ఇబ్బది రాకుండా ఈ ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News