Friday, September 20, 2024

భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం

- Advertisement -
- Advertisement -

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గురువారం ఢిల్లీ లో పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు.మొదటగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తో తన కార్యాలయంలో సమావేశమై భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలో నూతన గ్రీన్ ఫీల్ ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.అదే విధంగా వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి నుంచి సానుకూల స్పందన లభించింది. పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మంత్రి తుమ్మల సమావేశం అయ్యారు. తెలంగాణలో నూతన కోకోనట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా కేంద్రమంత్రిని కోరారు. ఆయిల్ ఫామ్ మీద 28 శాతం దిగుమతి సుంకం విధించి, దేశీయంగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆయిల్ పామ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తేనే ఆ పంట సాగు చేసే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు.దిగుమతులను తగ్గించి దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహిస్తే పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తగ్గించవచ్చని అన్నారు.ఆ కోవలోనే ఆయిల్ పామ్ కు కు కేంద్రం కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు.అలాగే ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించారు.అంతే కాకుండా ఇటీవలి ఖమ్మం జిల్లా వరదల గురించి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించారు,జరిగి నష్టాన్ని కేంద్రమంత్రి కళ్ళారా చూసిన నేపధ్యంలో తగిన మొత్తంలో కేంద్రం నుంచి సహాయం అందజేయాలని కోరారు. అందుకు కేంద్రమంత్రి స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై నివేదిక రాగానే త్వరగా సహాయం అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ను కలిసి, తెలంగాణ లో ఎక్కువగా పండే పంటలకు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యాలని కోరారు.

అదే విధంగా ఆయన తన ఢిల్లీ పర్యటనలో భాగంగా , ఢిల్లీ లోని భారత మండపంలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ,మోనిన్ ఇండియా ఎండీ జెర్మైన్ అరౌద్,బిఎల్ అగ్రో ఎండీ నవనీత్ రవికర్ లతో పాటు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యి తెలంగాణ రాష్ట్రంలో లభ్యమయ్యే అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని వారికి ఆహ్వానించారు.అదే విధంగా సదస్సులో భాగంగా భారత్ మండపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను సందర్శించి రాష్ట్రానికి చెందిన పలు స్టాల్ లను పరిశీలించారు. చివరగా మంత్రి తుమ్మల న్యూఢిల్లీలోని లీలా ప్యాలస్ హోటల్లో డెలాయిట్ ఇండియా నిర్వహించిన గ్రోత్ విత్ ఇంపాక్ట్ – గవర్నమెంట్ సమ్మిట్ లో పాల్గొని లీడర్స్ టాక్ సెషన్లో భాగంగా ‘వికసిత్ తెలంగాణ‘ అంశంపై ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News