Thursday, January 23, 2025

కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్‌పోర్ట్ అధికారులు

- Advertisement -
- Advertisement -

బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాసుల కోసం క్యూలైన్‌లో నిలబడాల్సి అవసరం లేదు

మనతెలంగాణ/హైదరాబాద్:  నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం శుభవార్త చెప్పింది. విమానం ఎక్కే ప్రయాణికులు బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాసుల కోసం క్యూలైన్‌లో నిలబడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతుండడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు స్వస్తి పలుకుతూ సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఇందులో భాగంగా విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ప్రాంతంలోనే ప్రయాణికులు సెల్ఫ్ చెక్‌ఇన్ చేసుకోవచ్చు. అక్కడే ప్రయాణికులు బోర్డింగ్ పాసులతో పాటు లగేజీ పాసులను పొందొచ్చు. ఈ నెల 01వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. విమానం ఎక్కే సమయానికి 6 గంటల ముందు నుంచి ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు పొందొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News