రావిర్యాల మీదుగా గ్రీన్
కారిడార్ మెట్రోరైల్
మార్చి లోగా డిపిఆర్ పూర్తి
బహదూర్‌గుడా, పెద్ద గోల్కొండలో అంతర్జాతీయ
స్థాయిలో స్టేషన్ల నిర్మాణం
గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై 22
కిలోమీటర్లు భూతలంపై మెట్రో
ఎంఆర్‌ఎల్ ఎండి ఎన్‌విఎస్
రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ మా ర్చిలోగా పూర్తి కానుందని హైదరాబాద్ ఎ యిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుండి మీర్‌ఖాన్‌పేట్‌లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సి టీ వరకు మెట్రో కారిడార్ డిపిఆర్ తయారీ కోసం జరుగుతున్న సర్వే పనులను ఆయన ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలిం చి అనేక సూచనలు చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, సి కింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత వరుస లో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చే యాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దా ర్శనికతకు దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది సిఎం సంకల్పమని తెలిపారు.
ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్‌ఏండిఎ, టిజిఐఐసితో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీకి అనుగుణంగా గ్రీన్ కారిడార్‌లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుండి త్వరితగతిన సులభంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలన్నది ముఖ్యమంత్రి అభిమతంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనలు వాస్తవరూపం దాల్చేందుకు కసరత్తు చేస్తున్నామని, దాదాపు పదిహేను వేల ఎకరాలలో విస్తరించనున్న భవిష్యనగరిని కాలుష్యరహిత నగరంగా రూపొందించడంలో, దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. కొంగర కలాన్ దాటిన తరువాత ప్రస్తుతం రోడ్ లేకపోవడం వల్ల కాలినడకన కొండలు, గుట్టలు దాటుకొని ఆయన ఈ క్షేత్ర పర్యటన జరిపారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని, అది ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుండి మొదలై, కొత్తగా ఏర్పడబోయే మెట్రో రైల్ డిపో పక్క నుండి ఎయిర్‌పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్ పల్లి రోడ్డు గుండా 5 కిలోమీటర్లు ముందుకు సాగాక పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్‌కి చేరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా అక్కడ బహదూర్‌గుడాలో ఉన్న దాదాపు 1000 నుండి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్‌గుడా, పెద్ద గోల్కొండలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవునా ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా ఓఆర్‌ఆర్‌లో మెట్రో రైల్‌కి కేటాయించిన భాగంలో తక్కువ ఎత్తులో నిర్మిస్తామని తెలిపారు.
రావిర్యాల్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్‌ఖాన్‌పేట్ వరకు హెచ్‌ఎండిఎ 100 మీటర్లు (328 అడుగులు) వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్ రహదారి మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రో రైల్‌కి కేటాయించారని తెలిపారు. ఈ కేటాయించిన రోడ్ మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ ’ఎట్ గ్రేడ్’ (భూ తలంపై) మెట్రోగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ విశాల మైన రోడ్ మధ్యలో అదే లెవెల్‌లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని తెలిపారు. ప్రధాన రహదారికి ఇరువైపులా మళ్లీ రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. తన గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓఆర్‌ఆర్ నిర్మిస్తున్నప్పుడు ఓఆర్‌ఆర్‌లో అంతర్భాగంగా భవిష్యత్‌లో నిర్మించబోయే మెట్రోకి తగినంత స్థలాన్ని కేటాయించాలన్న అప్పటి తన ప్రతిపాదనను అంగీకరించి ఓఆర్‌ఆర్‌లో 20 మీటర్లు మెట్రోకి కేటాయించారని గుర్తు చేశారు.
వీటివల్ల హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెంది, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షిస్తోందని; ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైదరాబాద్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రపంచంలో ప్రప్రథమంగా రూ.22 వేల కోట్లతో మెట్రో మొదటి దశను 69 కిలోమీటర్ల మేర పిపిపి పద్ధతిన విజయవంతంగా పూర్తి చేసామో, అదేవిధంగా ఈ ప్రణాళికలను కూడా ముఖ్యమంత్రి దార్శనికతతో కార్యరూపం దాల్చేలా హెచ్‌ఎండిఎ, టిజిఐఐసి, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తాయని అన్నారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లతో పాటు, ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ కూడా ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.