Monday, December 23, 2024

రిపబ్లిక్ డే వేడుకలు.. ఢిల్లీలో 19 నుంచి గగనతల పరిమితులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి సిద్ధమయ్యేందుకు దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు గగనతల పరిమితులను విధించారు. షెడ్యూల్డ్ విమాన సర్వీస్‌లపై దీని ప్రభావం ఉండదు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ ఎయిర్ సర్వీస్‌కు సంబంధించి నాన్ షెడ్యూల్ విమానాలు మాత్రం ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 వరకు ల్యాండింగ్ లేదా టేకాఫ్ చేయడానికి అనుమతించరు. ఈ ఆంక్షలు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటాయి. ఐఎఎఫ్, బిఎస్‌ఎఫ్, ఆర్మీ హెలికాప్టర్ సర్వీస్‌లకు, ప్రభుత్వానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లపై ఆంక్షల ప్రభావం ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News