Sunday, December 22, 2024

నేటి రాత్రి నుంచి పెరుగనున్న మొబైల్ రీఛార్జీ ధరలు

- Advertisement -
- Advertisement -

ఏమి చేయాలంటే…

న్యూఢిల్లీ: దేశంలో  జియో, ఎయిర్ టెల్ వంటి టెలికామ్ దిగ్గజ టెలికామ్ కంపెనీలు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి రీచార్జీ ధరలు పెంచేస్తున్నాయి. కానీ మీరు ఇప్పుడు రీచార్జీ చేస్తే పెరిగే ధరల భారం నుంచి తప్పించుకోవచ్చు. మీ ప్లాన్ యాక్టివ్ గా ఉన్నా సరే నేటి రాత్రి 12.00 గంటల లోపు ఎప్పుడైనా రీచార్జీ చేసుకోండి. జియో, ఎయిర్ టెల్ యూజర్లకు అడ్వాన్స్ గా రీచార్జ్ చేసుకునే వెసలు బాటు ఉంది. మిగతా వారికి ఈ అవకాశం లేదన్న విషయం గుర్తుంచుకోండి.

జియో సబ్స్రయిబర్లు ఏ ప్లాన్ అయినా ముందుగానే రీచార్జ్ చేయవచ్చు, కానీ ఎయిర్ టెల్ సబ్స్రయిబర్లు మాత్రం ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న ప్లాన్ తోనే రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. వొడాఫోన్-ఐడియా యూజర్లు ఇలా ముందుగా రీచార్జ్ చేసుకోలేరు, వారు మాత్రం భారాన్ని భరించాల్సిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News