Sunday, December 22, 2024

జియోకి పోటీగా ఎయిర్‌టెల్..

- Advertisement -
- Advertisement -

ముంబయి: జియోకి పోటీగా భారతీ ఎయిర్‌టెల్ రెండు కొత్త బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్ బై ప్లాన్లుగా వీటిని ప్రకటించింది. వీటి ధర రూ.199, మరోప్లాను రూ.399గా వెల్లడించింది. గత నెల బ్యాకప్ పేరిట జియో రూ.198కి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది.

కాగా ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్లను 10ఎంబిపిఎస్ వేగంతో అందిస్తోంది. రౌటర్ సైతం ఉచితంగా అందజేయనుంది. రూ.199ప్లాన్ కోసం 5నెలల చందా, రూ.500ఇన్‌స్టాలేషన్ కలిపి రూ.1674 చెల్లించాలి. అదేవిధంగా రూ.399 ప్లానులో ఉచిత రౌటర్‌తోపాటు అదనంగా ఎక్స్‌ట్రీమ్ బాక్స్, 350చానళ్లు ఉచితం. ఈ ప్లానుకోసం రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News