Sunday, December 22, 2024

మొక్కలు నాటిన ఎయిర్ టెల్ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

Airtel employees planting seedlings

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా చెంగిచెర్ల ఫారెస్ట్ అర్బన్ పార్క్ లో ఎయిర్ టెల్ ఉద్యోగులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వంద మంది ఉద్యోగులు వంద మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని ఎయిర్ టెల్ ఉద్యోగులు అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టాలన్న పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ప్రకృతికి మేలు కలిగేలా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కి సంస్థ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ఎయిర్ టెల్ ఉద్యోగులను ఎంపి సంతోష్ అభినందిం చారు. కార్పొరేట్ కంపెనీలు ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఎందరికో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News