- Advertisement -
న్యూఢిల్లీ : మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ నికర లాభం రూ.రూ.2007.8 కోట్లతో 164.46 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.759 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్ బోర్డు ఒక్కో షేరుకు రూ.3 డివిడెండ్ ప్రకటించింది. భారతీ ఎయిర్‌టెల్ ఆదాయం 22 శాతం పెరిగి రూ.31,500 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంలో ఆదాయం రూ.29,867 కోట్లుగా ఉంది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.25,747 కోట్లుగా ఉంది. భారతి ఎయిర్‌టెల్ సగటు ఆదాయం (ఆర్పు) రూ.178గా ఉంది. మూడో త్రైమాసికంలో ఇది రూ.163 ఉండగా, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.145గా ఉంది. భారతీ ఎయిర్‌టెల్ స్వల్పకాలికంలో రూ. 200, దీర్ఘకాలికంగా రూ. 300 ఆర్పు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- Advertisement -