Monday, December 23, 2024

5జి ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించిన ఎయిర్‌టెల్

- Advertisement -
- Advertisement -

Airtel successfully conducted 5G trial

బెంగళూరులోని బాష్ ఫెసిలిటీలో నిర్వహణ

ముంబయి : దేశంలో త్వరలోనే 5 జి సేవ లు ప్రారంభమవుతాయని కేంద్రం ప్రకటించినప్పట్నించీ ఈ సేవలను అందించడానికి ప్రై వేటు టెలికాం కంపెనీల మధ్య పోటీ కూడా తీవ్రమయింది. ప్రముఖ ప్రైవేటు టెలికాం కంపెనీల్లో ఒకటయిన ఎయిర్‌టెల్ శుక్రవా రం బెంగళూరులోని బాష్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్‌లో 5 జి ట్రయల్స్‌ను విజయవంతం గా నిర్వహించింది. దేశంలో ఈ ట్రయల్స్ నిర్వహించిన తొలి సంస్థ ఇదే కావడం గమనార్హం. ఈ నెలలో 5 జి స్పెక్ట్రంను కేంద్రం వే లం వేయనుండడం, ప్రైవేటు టెలికాం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయింపుపై ప్రముఖ టెలి కాం, ఐటి కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉన్న తరుణంలో ఎయిర్‌టెల్ ఈ ట్రయల్స్‌ను నిర్వహించడం గమనార్హం. ప్రభుత్వం తనకు కేటాయించిన స్పెక్టమ్‌ను ఉపయోగించుకొని ఎయిర్‌టెల్ నాణ్యత మెరుగుదల, నిర్వహణా సామర్థంకోసం ప్రభుత్వం తనకు కేటాయించిన స్పెక్టమ్‌ను ఉపయోగించుకొని ఎయిర్‌టె ల్ బాష్ సంస్థలో రెండు ఇండస్టియల్ గ్రేడ్ యూజర్లను అమలు చేసింది. ఈ రెండు సం దర్భాల్లోనూ5 జి టెక్నాలజీ కంటెంట్ డౌన్‌లోడింగ్ సమయాన్ని తగ్గించడంతో పాటుగా శరవేగంగా నిర్వహించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News