హైదరాబాద్ : వేగవంతమైన డిజిటల్ యుగంలో కనెక్ట్ అవ్వడం చాలా కీలకం, మొబైల్ సేవలలో చిన్న అంతరాయం, అసౌకర్యం వినియోగదారుల్లో తీవ్ర నిరాశను మిగల్చడం ఖాయం. రాష్ట్రంలోని అతిపెద్ద మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన ఎయిర్‌టెల్ వినియోగదారులకు విసుగు తెప్పిస్తోంది. కాల్ డ్రాప్‌లు, నెమ్మదించిన ఇంటర్నెట్ వేగం, నిర్ధిష్ట కాలాల పాటు సేవలను ఎయిర్‌టెల్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచలేకపోతోంది. దీంతో ఎయిర్‌టెల్‌కు వినియోదారుల ఫిర్యాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. రాష్ట్రంలో ఎయిర్‌టెల్ యూజర్ బేస్‌లో గణనీయమైన భాగం ఊహించని కనెక్టివిటీ సమస్యలతో ఇబ్బంది పడుతోందని వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను బట్టే తెలుస్తోంది.
ఈ కారణంతో వృత్తిపరమైన జీవితంలో మొబైల్ వినియోగదారులంతా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎయిర్ టెల్ వినియోదారులు ప్రధానంగా కాల్ డ్రాప్ సమస్యతో సతమతమవుతున్నారు. దీనిపై ఎయిర్‌టెల్ స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంటోందని ఎయిర్‌టెల్ వినియోగదారుల ఆవేదనగా ఉంది. ఎప్పటికప్పుడు సమస్య పరిష్కృతమవుతుందని ఎదురుచూస్తున్నా ఎయిర్‌టెల్ మాత్రం సమస్యకు పరిష్కారం చూపలేకపోతోందని వినియోగదారులు గగ్గొలు పెడుతున్నారు. ఈ విషయంలో ‘ఎయిర్‌టెల్’ ఇప్పటి కైనా వినియోగదారుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది.