Monday, December 23, 2024

ఎయిర్‌టెల్ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సర్వీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ కంపెనీ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ పేరిట ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సర్వీసులను ప్రారంభించింది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి నగరాల్లో మాత్రమే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులో లేని నగరాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ఈ ఎయిర్ ఫైబర్ సేవలు ఉపయోగపడతాయని ఎయిర్ టెల్ సంస్థ చెప్పింది. మన దేశంలో ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణకు కొన్ని అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయి. ఎయిర్‌ఫైబర్ ఆ లోటును పూడ్చనుంది. ప్రతి ఇంటికి వైఫై సర్వీసుల అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఫస్ట్ ఢిల్లీ, ముంబాయి నగరాల్లో సర్వీసులు ప్రారంభించి.. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా సేవలు అందించాలని ఎయిర్ టెల్ సంస్థ టార్గెట్ పెట్టుకుంది.

మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద ఎయిర్ ఫైబర్ డివైజులను తయారు చేసినట్లు ఎయిర్ కన్జూమర్ బిజినెస్ డైరెక్టర్ సారస్వత్ శర్మ తెలిపారు. ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లగ్ అండ్ ప్లే డివైజ్ వైఫై 6 టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. 64 డివైజుల వరకూ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైబర్ డివైజ్ కొనుగోలు చేసిన తర్వాత ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డివైజ్ మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫైబర్ నెలవారీ ప్లాన్ రూ.799గా ఎయిర్‌టెల్ నిర్ణయించింది. 100 ఎంబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతాయి. ఆరు నెలలకు కలిపి ఒకేసారి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద మరో రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా రూ.7 వేలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సింగిల్ ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News