Monday, December 23, 2024

ఎయిర్‌టెల్ లాభం 37.5 శాతం డౌన్

- Advertisement -
- Advertisement -

క్యూ2లో రూ.1,341 కోట్లకు తగ్గిన లాభం

ముంబై : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో నిరాశపర్చింది. కంపెనీ నికర లాభం రూ.1,341 కోట్లతో 37.5 శాతం క్షీణతను చూసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.2,145 కోట్లుగా ఉంది. ఇక ఎయిర్‌టెల్ ఆదాయం రూ.37,043 కోట్లతో 7.28 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.34,526 కోట్లుగా ఉంది.

ప్రస్తుత త్రైమాసికంలో నైజీరియన్ నైరా డీవాల్యుయేషన్ ఫ్లో వల్ల ఆదాయ వృద్ధిపై ప్రభావం పడిందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఎబిటా రూ.19,956 కోట్లతో 10.96 శాతం పెరిగింది. ఎబిటా మార్జిన్ 20 బేసిస్ పాయింట్లు క్షీణించి 53.1 శాతం నమోదైంది. రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పు) రూ.203తో 1.5 శాతం పెరిగింది. కంపెనీ మొబైల్ కస్టమర్ల సంఖ్య 4.4 శాతం పెరిగి 34.23 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News