Wednesday, January 22, 2025

ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక , రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

- Advertisement -
- Advertisement -
ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

హైదరాబాద్ : ఎఐఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక , రాజకీయ శిక్షణ శిక్షణ తరగతులు ఈ నెల 26,27,28 వ తేదీల్లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో జరుగనున్నాయని, ఈ శిక్షణ తరగతుల్లో ప్రస్తుతం కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్ విద్యార్థి ఉద్యమ కార్యాచరణ రూపొంది స్తున్నామని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ తెలిపారు. ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాన్ని సోమవారం మేడ్చల్‌మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ లోని బొమ్మక్ ఆర్ కన్వేషన్ హల్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తూ విద్యార్థి వ్యతిరేక విధానాలను ఆవలంబిస్తున్నాయన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్య కాషాయీకరణ, విద్య ప్రైవేటీకరణ చేస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ తెలంగాణ విభజన హామీల్లో ఉన్న విద్యా సంస్థలను తెలంగాణకి కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని జిల్లాకు నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయలు, ఐఐటి, ఐఐఎమ్ లాంటి అనేక అనేక విద్యాసంస్థలు రాష్ట్రానికి కేటాయించకుండా తెలంగాణ విద్యార్థుల పట్ల కక్ష్యపూరితంగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న విధానాలపై 26,27,28 తేదీల్లో బొమ్మక్ ఆర్ కన్వేషన్ హల్ లో జరిగే శిక్షణ తరగతుల్లో చర్చించి విద్యార్థి ఉద్యమ కార్యచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూల నుండి ఎంపిక చేయబడిన విద్యార్థి నాయకులు హాజరవనున్నారని, ఈ శిక్షణ తరగతుల జయప్రదానికి విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి అన్వర్,హరీష్, చిన బాబు, సందీప్,రమేష్, సిద్దు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News