Sunday, December 22, 2024

ఎఐఎస్‌ఎఫ్‌నేతలు సచివాలయం ముట్టడి యత్నం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఎఐఎస్‌ఎఫ్) నాయకులు సచివాలయం ముట్టడికి యత్నించారు. దీంతో సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ విద్యాలయాల్లోకి విద్యార్థి సంఘాలను , రాజకీయ నాయకులను అనుమతివ్వొద్దంటూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. విద్యార్థి నేతలంతా ఒక్కసారిగా సచివాలయం వైపు దూసుకురావడంతో పోలీసులు వారి అడ్డుకున్నారు. ఇదేక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుల పట్ల పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంమే కాకుండాపోలీస్ ఉన్నతాధికారులు చేయి చేసుకున్నారు.

దీంతో విద్యార్థి నాయకులు పోలీసుల మధ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అడిగే వారినీ పోలీసులు అడ్డుకునే నేపంతో తమపై జూలుం ప్రదర్శించారని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే హక్కు విద్యార్థి సంఘాలుగా తమకు ఉందన్నారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు ఏఐఎస్‌ఎఫ్ నాయకులను ఈడ్చికెళ్లి వ్యాన్‌లో ఎక్కించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నాయకులను ముషీరాబాద్, సైఫాబాద్ పోలీసుస్టేషన్లకు తరలించారు. అరెస్టు అయిన వారి ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, రాష్ట్ర నాయకులుమర్రి శ్రీమాన్, జ్యోతి, క్రాంతి, రఘురామ్, రాజు, అన్వర్, హారీష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News