Wednesday, January 22, 2025

ఐశ్వర్య – అభిషేక్ విడాకులు..? స్పందించిన బచ్చన్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ నటీనటులు ఆశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. ఈ రూమర్స్ ను ఆయన తీవ్రంగా ఖండించాడు. తాజాగా ఓ ఈవెంట్ లో కూతురు ఆరాధ్యతో కలిసి ఆశ్యర్య పాల్గొన్నారు. వారి ఫొటోకు ఓ యూజర్ ‘May fav people’ అని కామెంట్ చేశారు. దీనికి అభిషేక్ బచ్చన్ ‘mine too’ అని సమాధానం ఇచ్చి ఆశ్యర్యపరిచారు. దీంతో విడాకులు ఉత్త ప్రచారమేనని స్పష్టమైంది.

కాగా ఇటీవల ఈ దంపతులు పలు ఈవెంట్లలో కలిసి కనిపించకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రచారం జోరందుకుంది. అయితే గత కొన్నిరోజులుగా పార్టీలు, ఫంక్షన్లకు ఐశ్వర్యరాయ్ ఒక్కరే హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన నీతా అంబానీ (nita ambani) కల్చరల్ సెంటర్ ఈవెంట్‌కు ఐష్.. కూతురుతో అటెండ్ అయ్యారు. వాళ్లతో అభిషేక్ బచ్చన్ రాలేదు. దీంతో ఈ జంట విడిపోతున్నారా అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News