Sunday, December 22, 2024

ఐశ్వర్య రాయ్ అత్యంత ధనవంతురాలైన హిరోయిన్

- Advertisement -
- Advertisement -

ముంబై:  అభిషేక్ బచ్చన్ సంపద కేవలం రూ. 280 కోట్లే అయితే, ఆయన భార్య, నటి ఐశ్వర్యా రాయ్ సంపద రూ. 862 కోట్లు. దాంతో సినిమా రంగంలో అత్యధిక సంపద కలిగిన హిరోయిన్ ఈమెనంటున్నారు. ఈమె సంపద చాలా మంది హిరోల కన్నా ఎక్కువేనని చెప్పాలి. ఆమెకు ఇంతగా సంపద చేకూరడానికి కారణం ఆమె హిందీ, తమిళ్, తెలుగు, హాలీవుడ్ సినిమాలలో నటించడమే. పైగా ఆమె అనేక అంతర్జాతీయ బ్రాండ్ లకు పనిచేసి సంపాదించింది.

ఐశ్వర్యా రాయ్ తర్వాత సంపద కలిగిన హిరోయిన్లు ప్రియాంక చోప్రా(రూ. 650 కోట్లు), ఆలియా భట్(రూ.550 కోట్లు), దీపికా పదుకొణే (రూ.500 కోట్లు), కరీనా కపూర్ (రూ. 485 కోట్లు), కత్రినా కైఫ్(రూ. 250 కోట్లు), నయనతార (రూ. 200 కోట్లు). అయితే ఐశ్వర్యా రాయ్ కి వీరంతా సంపదలో సరితూగలేని వారే.

ఐశ్వర్య రాయ్ ఈ మధ్య నటించిన తమిళ్ సినిమా పొన్నియన్ సెల్వన్ కు రూ. 15 కోట్లు తీసుకుంది. అంతేకాక ఆమె ఏదేని బ్రాండ్ కు పనిచేస్తే రోజుకు రూ. 6 నుంచి 7 కోట్లు ఛార్జ్ చేస్తుందట.

ఐశ్వర్యా రాయ్ కన్నా తక్కువ సంపద కలిగిన హిరోలలో అభిషేక్ బచ్చన్ (రూ. 280 కోట్లు), రణ్ బీర్ కపూర్ (రూ. 345 కోట్లు), ప్రభాస్ (రూ. 200 కోట్లు), రణ్ వీర్ సింగ్ (రూ. 500 కోట్లు) ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News