Wednesday, January 22, 2025

మణిరత్నం కాళ్లు మొక్కిన అందాల నటి ఐశ్వర్యా రాయ్

- Advertisement -
- Advertisement -

అబూధాబి లోని యస్ ద్వీపంలో ఐఐఎఫ్ఏ ఉత్సవం-2024 జరిగింది. దీనికి అనేక మంది నటీనటులు హాజరయ్యారు. ఇటు దక్షిణాది చిత్ర పరిశ్రమ, అటు బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన వారెందరో వచ్చారు. విశేషమేమిటంటే ఈ చిత్రోత్సవం లో ప్రముఖ అందాల నటి ఐశ్వర్యా రాయ్ ‘పొన్నియిన్ సెల్వన్: 2కుగాను ‘ఉత్తమ దర్శకుడు’(తమిళ్) అవార్డును నిర్మాత మణిరత్నం కు బహూకరించాక ఆయన కాళ్లు అద్దుకుని ఆశీర్వాదం తీసుకుంది. వినమ్రత అంటే ఇదేనేమో! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మణిరత్నంను ఐశ్వర్యా రాయ్ తన గురువుగా భావిస్తుంది. ఆయనతో సినిమాలో పనిచేయడం తనకు గర్వంగా ఉంటుందని కూడా ఆమె నిస్సంకోచంగా చెబుతుంది. ఉత్తమ నటుడు(తమిళ్) అవార్డును విక్రమ్, ఉత్తమ నటి(తమిళ్) అవార్డును ఐశ్వర్యా రాయ్ అందుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ 2లో ఆమె నందిని పాత్ర పోషించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News