విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈనెల 14న ’సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను. ’సంక్రాంతికి వస్తున్నాం’ నాకు చాలా స్పెషల్. గోదారి గట్టు పాట అందరికీ రీచ్ అయ్యింది. నేను ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే ప్రతి ఒక్కరూ నాతో ఫోటో తీసుకుంటున్నారు. అది ఆ పాటకి వచ్చిన రీచ్. ఆ సాంగ్ ఒక వైల్డ్ ఫైర్‌లా పాకింది. -తెలుగులో నాకు ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు. ఆ లోటు గోదారి గట్టు పాటతో తీరింది. వెంకటేష్ లాంటి బిగ్ హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం అది ఇంత వైరల్ హిట్ కావడం ఆనందంగా వుంది.
అలాగే సినిమాలో పాటలన్నీ చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. పాటలు హిట్ అయితే సగం సినిమా పాసైపోయినట్లే. ట్రైలర్ ఆ అంచనాలని మరింతగా పెంచింది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా. సినిమాలో నేను చేసిన భాగ్యం.. మామూలు క్యారెక్టర్ కాదు. కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా కష్టమే. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆడియన్స్ చూస్తున్నప్పుడు జాలి పుట్టే క్యారెక్టర్. -హీరో వెంకటేష్‌లో ఎమోషన్స్ అన్నీ సహజంగా వుంటాయి. ఆయన టైమింగ్ అద్భుతం. ఆయనతో కలసి నటించడం మామూలు విషయం కాదు. అయితే ఆయన చాలా ప్రోత్సహించేవారు.భాగ్యం క్యారెక్టర్‌లో అదరగొడుతున్నావ్ అని మెచ్చుకునే వారు. వెంకటేష్, నేను, మీనాక్షి .. ముగ్గురూ సినిమా అంతా ట్రావెల్ అవుతాం. మా ముగ్గురిని చూడాల్సిందే. ఇందులో వెంకీది మా ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్. -దిల్ రాజు, శిరీష్ బ్యానర్‌లో వర్క్ చేయడం మంచి అనుభవాన్నిచ్చింది”అని తెలిపారు.