Wednesday, January 22, 2025

ఐశ్వర్య ఇంట్లో చోరీ చేసిన పనిమనిషి, డ్రైవరు అరెస్టు..

- Advertisement -
- Advertisement -

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో నగలు చోరీ చేసిన పనిమనిషి, డ్రైవరును పోలీసులు అరెస్టు చేశారు. తమ లాకర్లోని వజ్రాలు కనిపించడం లేదని ఐశర్య ఇటీవల తేనాంపేట్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పనిమనిషి ఈశ్వరి, డ్రైవరు వెంకటేశన్ కలిసి ఐశ్వర్య ఇంట్లో లాకర్లోని నగలను దొంగిలించినట్లు గుర్తించారు. వీరిద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్లు గ్రేటర్ చెన్నై పోలీసులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

గత 18ఏళ్లుగా ఇంట్లో పనిచేసిన ఈశ్వరి దొంగిలించిన నగలు అమ్మి ఆ డబ్బుతో ఇంటిని కొనుగోలు చేసిందని పోలీసులు వెల్లడించారు. నివాసానికి సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరునెలల కిందట పనిమానేసిన పనిమనిషి ఈశ్వరి బ్యాంకు ఖాతాలో రూ.లక్షల నగదు లావాదేవీలను దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. మంగళవారం ఈశ్వరిని అరెస్టు చేసిన పోలీసులు 100సవర్ల బంగారం, 30గ్రాముల డైమండ్ జ్యువెలరీ, 4కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News