Wednesday, January 22, 2025

సింగరేణి ఎన్నికల్లో ఎఐటియుసి ఘన విజయం…

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసి ఘన విజయం సాధించింది. ఎఐటియుసికి 3564 ఓట్లు రాగా ఐఎన్‌టియుసికి 2128 ఓట్లు వచ్చాయి. 1436 ఓట్ల మెజార్టీతో ఎఐటియుసి గుర్తింపు సంఘంగా ఎన్నికకాబడింది. ఆరు ప్రాంతాల్లో ఐఎన్‌టియుసి ప్రాతినిధ్యం దక్కించుకుంది. ఐదు ఏరియాల్లో ఎఐటియుసి ప్రాతినిధ్యం దక్కించుకుంది. పదకొండు ప్రాంతాల్లో అత్యధిక ఓట్లు పోలైన ఎఐటియుసి సంఘాన్ని గుర్తింపు సంఘంగా ప్రకటించారు. ఓట్ల సంఖ్య అత్యధికంగా ఉన్న ఐదు స్థానాల్లో ఎఐటియుసి విజయం సాధించింది.

ఎఐటియుసి గెలిచిన స్థానాలు
బెల్లంపల్లి: 122
మందమర్రి: 467
శ్రీరామ్‌పూర్: 2166
రామగుండం1: 451
రామగుండం2: 358
మొత్తం ఓట్లు: 3564

ఐఎన్‌టియుసి గెలిచిన స్థానాలు
కార్పొరేషన్: 342
కొత్తగూడెం: 233
మణుగూరు: 02
ఇల్లందు: 46
భూపాలపల్లి:801
రామగుండం3: 704
మొత్త ఓట్లు: 2128

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News