Wednesday, January 22, 2025

నేటి నుంచి మూడు రోజుల పాటు ఎఐవైఎఫ్ జాతీయ వర్క్ షాప్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జాతీయ వర్క్ షాప్ శనివారం ఉదయం 11 గంటలకు హిమాయత్ నగర్ లోని ,సత్య నా రాయణ రెడ్డి భవన్‌లో ప్రారంభం కానున్నాయని ఎఐవైఎఫ్ రాష్ట్ర అ ధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర తెలిపారు. 8 వ తేదీ నుంచి 10 వతేదీవరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి,మాజీ రాజ్య సభ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారని వెల్లడించారు.

ఈ వర్క్ షాప్ కు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎఐ వై ఎఫ్ జాతీయ అధ్యక్షులు సుఖేందర్ మహేసరి, ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్‌లతో పాటు అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధిలు, జా తీయ సమితి సభ్యులు హాజరుకానున్నారని వారు వెల్లడించారు. ఈ వర్క్ షాప్‌లో యువజనుల సమస్యలతో పాటు పాలకుల విధానాలపై ని ర్దిష్ట అంశాలపై విస్తృతంగా చ ర్చించి కార్యాచరణ రూపొందించ డం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News