Monday, December 23, 2024

పేదరిక నిర్మూలన పాత నినాదం:అజయ్ బంగా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ముందు హెచ్చుతగ్గులులేకుండా ఈ భూమి అందరికీ నివాస యోగ్య గ్రహం కావాల్సి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతోన్న జి 20 ఫైనాన్స్ ట్రాక్ ( ఆర్థిక మంత్రులు, ప్రధాన బ్యాంకుల గవర్నర్ల ) సమావేశం నేపథ్యంలో బంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన అనేది కేవలం నినాదప్రాయం కారాదని, దీనితో పాటు పలు సవాళ్లు కూడుకుని ఉన్నాయని తెలిపారు. పర్యావరణ మార్పులు, మహమ్మారిలు, ఆహార అభద్రత, బలహీనతల వంటి పలు అంశాలను సవాళ్లుగా తీసుకోవల్సి ఉందన్నారు. ఇవన్నీ మిళితం అయ్యి ఉంటాయని, వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించుకుంటేనే పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు. ప్రపంచబ్యాంక్ తన ముందు ఉన్న నిర్ధేశిత లక్షాలను మరింతగా విస్తృతపర్చుకోవల్సి ఉంటుంది. ఇప్పటివరకూ కేవలం పేదరిక నిర్మూలన ఒక్కటే లక్షంగా ఉంది.

దీనిని మించి మనం ఈ ప్రపంచాన్ని పేదరిక నిర్మూలన దశ నుంచి దాటించడమే కాకుండా , ఇది నివాస యోగ్యం కావాల్సి ఉందన్నారు. భారతీయ సంతతికి చెందిన బంగా ఈ సందర్భంగా ఇండియా పురోగతి గురించి ప్రస్తావించారు. భారతదేశంలో అభివృద్ధి కేవలం కేంద్రీకృతం అవుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. మున్సిపల్ స్థాయిలేదా స్థానిక ప్రాతిపదికగా సాగే ఆర్థిక ప్రక్రియతోనే దేశ ప్రగతి పరిపూర్ణం అవుతుందన్నారు. వివిధ స్థాయిల్లోకి మౌలిక సాధనాసంపత్తి, ఏర్పాట్లు విస్తరించుకుని తీరాలి. దీనికి మున్సిపాల్టీలు ప్రాతిపదిక కావల్సి ఉంటుందన్నారు. స్థానిక క్లిష్టతల పరిష్కారానికి కేంద్రీకృత వైఖరితో సాగే ఆర్థిక చర్యల వల్ల సమగ్ర ప్రగతి సాధ్యం కాదన్నారు, సరికొత్తగా పలు నగరాలు, పట్టణాలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమకూరాల్సి ఉంటుంది. ఇండియాలో నిర్థిష్ట రంగాలను ఎంచుకునే ప్రైవేటు రంగ పెట్టుబడులు వస్తున్నాయని, ప్రత్యేకించి నగరాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి దిశలో ప్రైవేటు పెట్టుబడులు ఏ మేరకు వస్తున్నాయనేది విశ్లేషించుకోవల్సి ఉందన్నారు.

తరచూ పిలుస్తూ పోతూ ఉంటే ప్రైవేటు పెట్టుబడులు రానే వస్తాయి. అయితే వీటి వల్ల ఏ మేరకు సత్పలితాలు అందుతున్నాయనేది తేల్చుకోవల్సి ఉందన్నారు. ఈ నెల 17, 18 తేదీలలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో భారత్ సారధ్యపు జి 20 తరఫున సభ్య దేశాల ఆర్థిక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు భేటీ (జి20ఎఫ్‌ఎంసిబిజి) జరుగుతుంది. ఈ సమావేశానికి సభ్య దేశాల ఆర్థిక మంత్రులు తరలివస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంయుక్తంగా ఈ మూడవ ఎఫ్‌ఎంసిబిజి భేటీకి అధ్యక్షత వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News