హైదరాబాద్: అజయ్ దేవ్ గన్, టబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఔరో మే కహా దమ్ థా’ 2 ఆగస్టున విడుదలయింది. ఈ సినిమా రివ్యూ నెగటివ్ కావడంతో ఆడియన్స్ ఈ సినిమా గురించి అసలు మట్లాడుకోవడమే లేదు. అజయ్ దేవగన్, టబ్బు నటించిన ఈ చిత్రం గురించి కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఓపెనింగ్ రోజునే రూ. 50 లక్షలు కలెక్షన్ రాబట్టలేకపోయింది. ప్రస్తుతానికి రూ. 38 లక్షల కలెక్షనే అంటున్నారు.
బాలీవుడ్ స్టార్ అయిన అజయ్ దేవ్ గన్ ‘షైతాన్’ వంటి హిట్ సినిమా ఈ ఏడాది అందించారు. కానీ తర్వాత వచ్చిన ఆయన చిత్రం ‘మైదాన్’ థియేటర్లలో అంతగా ఆడలేదు. అజయ్ దేవ్ గన్ అభిమానులు లేటెస్ట్ చిత్రం ‘ఔరో మే కహా దమ్ థా’ చిత్రంతో మరో మారు థియేటర్లలో సుడిగాలి సృష్టిస్తుందనుకున్నారు. కానీ అలా జరుగలేదు. ఈ సినిమా డైరెక్టర్ నీరజ్ పాండే. ఆయన ఇదివరలో ‘బేబీ’, ‘స్పెషల్ 26’ వంటి హిట్ సినిమాలు అందించారు. సాలిడ్ కాంబినేషనలో ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలం అయింది. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా అంతగా లేవు.
నిర్మాతలు మొదటి రోజు టికెట్ పై ఆఫర్ కూడా ప్రకటించారు. ఒకటి కొంటే మరొకటి ఉచితం అన్నా, అభిమానులను ఈ సినిమా ఆకర్షించలేకపోయింది. గురువారం సాయంత్రం వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కేవలం 7000 లే. కరోనా లాక్ డౌన్ తర్వాత పెద్ద ఫ్లాప్ అయిన చిత్రం ఇదేనని చెప్పొచ్చు. ఈ సినిమా 30 వేల అడ్వాన్స్ బుకింగ్ కూడా రాబట్టలేకపోయింది. అజయ్ దేవ్ గన్ ఇంతలా విఫలమైన చిత్రం ఇదేనేమో.
అజయ్ దేవ్ గన్ 15 ఏళ్ల కెరీర్ లో రూ. 3 కోట్ల ఓపెనింగ్ కన్నా తక్కువ ఓపెనింగ్ సినిమా ‘ ఔరో మే కహా దమ్ థా’. ఇదివరలో అజయ్ దేవ్ గన్ ‘ఆల్ ద బెస్ట్’ సైతం రూ. 3 కోట్ల కంటే తక్కువ ఓపెనింగ్ కాలేదు. అజయ్ దేవ్ గన్ ప్రస్తుత చిత్రం రివ్యూ నెగటివ్ గా ఉండడమే కాదు, దీని గురించి ప్రేక్షకుల్లో పెద్ద చర్చ కూడా లేదు. దీని రేటింగ్ 1.5 అంటే నమ్మబుద్ధి కావడంలేదు. లవ్ స్టోరీ చిత్రమైన ఈ సినిమాలో దమ్మే లేదని తేలిపోయింది.