Wednesday, January 22, 2025

నటుడు అజయ్ దేవ్‌గణ్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలివుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ నేడు 54 ఏళ్లకు చేరుకున్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ముంబైలోని ఆయని ఇంటి బయట అనేక మంది అభిమానులు గుమ్మికూడి ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘బోళా’ సినిమా గత వారమే థియేటర్లలో విడుదలయింది. దానికి ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అజయ్ దేవ్‌గణ్ తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటి నుంచి బయటికి వచ్చి అందరినీ గ్రీట్ చేశాడు. చాలా మంది అభిమానులు ఆయనకు పుష్పగుచ్ఛాలు, పోస్టర్లు, మిఠాయిలు ఇచ్చారు. అంత మంది అభిమానులను చూసి అజయ్ దేవ్‌గణ్ ఉప్పొంగిపోయాడు.

అజయ్ దేవ్‌గణ్ 1991లో ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాతో చిత్ర రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత అతడు యాక్షన్ హిరోగా తనను తాను నిరూపించుకున్నాడు. గోల్‌మాల్, గోల్‌మాల్ రిటర్న్, గోల్‌మాల్ 3 వంటి కామెడీ సినిమాల్లో కూడా మెప్పించాడు. అతడు నటి కాజోల్‌ను 1999లో వివాహం చేసుకున్నాడు. అతడికి ‘న్యాస’ అనే కూతురు, ‘యుగ్’ అనే కొడుకు ఉన్నారు. అతడు తదుపరి ‘సింగం’, ‘మైదాన్’ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News