Wednesday, January 22, 2025

అజియోగ్రామ్‌తో డి2సి ఇ-కామర్స్‌లోకి ప్రవేశించిన అజియో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశీయ ప్రముఖ ఫ్యాషన్ ఇటైలర్ అజియో డి2సి ఇకామర్స్ ప్లాట్‌ఫామ్ ‘అజియోగ్రామ్’ను ప్రారంభించింది. ఈ వేదికతో కంపెనీ దేశీయ ఫ్యాషన్ స్టార్టప్‌ల సాధికారతను లక్ష్యంగా చేసుకుంది. దీం తో కంపెనీ విజన్, సరికొత్త ఆవిష్కరణ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. అజియో యాప్‌తో అజియోగ్రామ్ సులభగంగా స్టోర్లను యాక్సెస్ చేసేందుకు అవకాశమిస్తుంది. వచ్చే సంవత్సరం నాటి 200 ఎక్స్‌క్లజివ్ డి2సి బ్రాండ్లను లక్షంగా చేసుకుంది. వీటిలో స్ట్రీట్‌వేర్ నుంచి ఫాస్ట్, మినిమలిస్టిక్, లగ్జరీ, స్థిరమైన ఫ్యాషన్ వంటివి ఉ న్నాయి. అజియో సిఇఒ వినీత్ నాయర్ మాట్లాడుతూ, పె రుగుతున్న కొత్త తరం షాపర్లు బ్రాండ్ నుంచి కేవలం ఉత్పత్తులే కాకుండా వినూత్న ఉత్పత్తులను కోరుకుంటున్నారని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా డి2సి విప్లవం అనేక బ్రాండ్లను అందిస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News