Monday, December 23, 2024

అజిత్ పవార్ వెంట 40 మందికిపైగా ఎన్‌సిపి ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన జఅఇత్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపి గ్రూపు బుధవారం ఉదయం బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్టు కాంప్లెక్స్‌లో సమావేశమైంది. తమ వెంట 40 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నట్లు అజిత్ పవార్ వర్గం ప్రకటించింది.

తమకు 40 మందికి పైగా ఎన్‌సిపి ఎమ్మెల్యేల బలం ఉందని అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ త్రెలిపారు. తమకు తగినంత సంఖ్యాబలం ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అజిత్ పవార్ వర్గంలో చేరిన ఛగన్ భుజ్‌బల్ వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొనడానికి అక్కడకు చేరుకున్న అజిత్ పవార్‌కు పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు.

ఇదిలా ఉండగా..శరద్ పవార్-సుప్రియా సూలె వర్గానికి చెందిన ఎన్‌సిపి ఎమ్మెల్యేలు కూడా మధ్యాహ్నం సమావేశం కానున్నారు. అయితే సమావేశం జరుగుతున్న పార్టీ ఆఫీసుకు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ మంది చేరుకున్నారు. తమ వద్ద 12, 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, వీరి సంఖ్య మరో ఒకటి, రెండు పెరగవచ్చని పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News