Saturday, December 21, 2024

గాంధీ స్థానంలో సుభాష్ చంద్రబోస్ ఉంటే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చిన తరువాత నేతాజీ చంద్రబోస్ అక్కడ ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదని, జాతీయ భద్రతా సలహాదారు అతిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ స్థానంలో బోస్ ఉండి ఉంటే బ్రిటిష్ వాళ్లను స్వాతంత్య్రం కోసం అడుక్కునేందుకు అంగీకరించేవారు కాదని అన్నారు. గాంధీతో విభేదించే ధైర్యసాహసాలు నేతాజీకి ఉన్నా గాంధీని బోసు గౌరవించేవారని చెప్పారు.

పాక్ జాతిపితగా చెప్పుకునే జిన్నా సైతం తాను ఒకే నాయకుడిని అంగీకరిస్తానని, ఆయనే సుభాష్ చంద్రబోస్ అని చెప్పారని దోవల్ తెలిపారు. అసోచామ్ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన నేతాజీ చంద్రబోస్ స్మారకోపన్యాసంలో దోవల్ మాట్లాడుతూ దేశ ప్రజల సామర్ధంపై బోస్‌కు అపారమైన విశ్వాసం ఉండేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News