Saturday, November 23, 2024

నెతన్యాహుతో అజిత్ డొభాల్ భేటీ.. గాజాలో పోరుపై చర్చ

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమై గాజాలో సాగుతున్న యుద్ధంపైన, బాధితులకు మానవతా సాయం అందడం పైన చర్చించారు. అత్యవసరంగా బాధితులకు ఆహారంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించవలసి ఉందని సూచించారు. దీనిపై గాజా స్ట్రిప్‌లో తాజా పరిస్థితిని నెతన్యాహు అజిత్ డొభాల్‌కు వివరించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. గాజాలో యుద్ధ ప్రారంభమై ఇంతవరకు 30 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

అలాగే హమాస్ మిలిటెంట్ల దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు మృతి చెందగా, 250 మంది బందీలయ్యారు. బందీలను వెంటనే విడుదల చేసి, మానవతా సాయం బాధితులకు తక్షణం అందించాలని చర్చలో డొభాల్ కోరారు. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు జఖీ హనెజ్బిని కూడా డొభాల్ కలుసుకుని చర్చించారు. గాజా లోని పాలస్తీనియన్లకు అవసరమైన మానవతాసాయాన్ని భారత్ అందించే ప్రయత్నాలు సాగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News